టీడీపీ నేత వంగవీటి రాధా కృష్ణ స్వల్వ గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది.
దీంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం హుటాహుటిన ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్ల అబ్జర్వేషన్‌లో ఉన్నారు. రాధా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.