విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గ్యాలరీలో ఉన్న ఓ బాలిక.. తనకు ఫోటో కావాలని సీఎం చంద్రబాబుకు సైగ చేయగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. స్టేజ్ మీదకు రమ్మని పిలవడంతో బాలిక అక్కడి వెళ్లింది. సీఎం చంద్రబాబుకు పాదాభివందనం చేసింది. బాలికతో ఫోటో దిగిన తర్వాత చంద్రబాబు పాపతో కాసేపు ముచ్చటించారు.