18 ఏళ్లుగా అంబేద్కర్ వర్ధంతి రోజున ధర్మారావు ఫౌండేషన్ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం ఆయన కాంపు కార్యలయంలో అంబేడ్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి రక్తదానం చేశారు.