విజయవాడ: నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించాలి

53చూసినవారు
విజయవాడ: నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించాలి
విజయవాడ నగరంలోని ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన నగరంలోని బృందావన కాలనీ, ఆయుష్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్