ఏ. కొండూరు ప్రాంతంలో కిడ్నీ వ్యాధి బారిన పడి అనేక మంది మరణిస్తున్నారని తిరువూరు నియోజకవర్గంలో 1000 మందికి పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు ఆవేదన వ్యక్తం చేసారు. విజయవాడలో గురువారం మీడియాతో మాట్లాడుతూ ఏ కొండూరు లో మంచి నీరు దొరకడం లేదన్నారు. ఈ సమస్యల పరిస్కారం కోరుతూ ఈ నెల 24 న ఏ కొండూరు లో కిడ్నీ బాధితులతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు