ప్రమాదవశాత్తు మృతి చెందిన టీడీపీ కుటుంబ సభ్యునికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సాయం మంజూరైంది. దీనికి సంబంధించిన చెక్కును స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు గొల్లపూడిలోని మైలవరం వసంత వెంకట కృష్ణప్రసాదు కార్యాలయంలో (టీడీపీ కార్యాలయం) బాధిత కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు.