విజయవాడ, గాంధీ నగర్ లోని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఏపీ ఎమ్మార్పీఎస్ అమరావతి రాజధాని అధ్యక్షుడి గా మందా నాగ మల్లేశ్వరరావు ని, మంగళవారం రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ నియమించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఎస్సి వర్గీకరణ లక్ష్య సాధన కోసం ఆంధ్ర -తెలంగాణ రాష్ట్రల జాతీయ సమావేశం, ఫిబ్రవరి 5 విజయవాడ నందు జరుగుతుందని అన్నారు.