తెల్లదొరలకు వ్యతిరేకంగా, తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం స్వాతంత్ర సమరయోధులు అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం ఫెర్రీ సెంటర్ లో దివంగత నేత, స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న 218వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మగౌరవం కోసం వీరోచితంగా పోరాడిన వ్యక్తి వడ్డే ఓబన్న అన్నారు.