ఆస్పరి మండల పరిధిలోని హలిగేర గ్రామంలో రామాంజినేయులు అనే జనసేన కార్యకర్త కుటుంబ పరిస్థితులు బాగాలేక సతమతమవుతున్న విషయం మండల జనసేనా నాయకులకు దృష్టికి వెళ్లింది. మండల కార్యదర్శి హనుమేశ్ తోటి నాయకులు కలిసి రామంజి కుటుంబాన్ని పరామర్శించి, వారికి పార్టీ ఏదో ఒక రకంగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తమ వంతు సాయంగా ఉచితంగా వంట గ్యాస్, పొయ్యి అందజేశారు. కార్యక్రమంలో మునిస్వామి, వెంకటేష్, ధనుంజయ, మారుతి, రామాంజి, రామిరెడ్డి పాల్గొన్నారు.