ఆస్పరి మండల పరిధిలోని ములుగుందo గ్రామంలో శ్రీశైలం తాత రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం స్వామి వారి 13వ సమారాధన సందర్భంగా ఆలయం లో ఉదయం శ్రీశైలం తాత సమాధిని ప్రత్యేక పూలతో అలంకరించి గంగపూజ, ఆకు పూజ, కుంకుమార్చన, పంచామృతాభిషేకం, మహా మంగళారతి పూజాకార్యక్రమాలు చేశారు. సాయంత్రం స్థానిక ఆలయం నుంచి రథోత్సవాన్ని అంజనేయస్వామి దేవాలయం వరకు లాగి అక్కడ పూజలు నిర్వహించారు.