కోడుమూరు నియోజకవర్గంలోని సుంకేసుల రిజర్వాయర్ కు ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ఎగువ నుంచి 1,00, 820 క్యూసెక్కుల నీటిని వచ్చి చేరుతోందని డ్యాం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. రిజర్వాయర్ నుంచి 23 గేట్లను ఎత్తి 98, 371 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 0. 990 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. కేసీ కెనాల్ కు 2, 445 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు.