కోడుమూరు మండలంలోని వెంకటగిరి గ్రామంలో బుధవారం గిడ్డాంజనేయస్వామి ప్రభోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉగాది వేడుకలను పురస్కరించుకుని గిడ్డాంజనేయస్వామి ఆలయంలో విశేష పూజలు చేపట్టారు. భూదేవి, శ్రీదేవి సహిత విష్ణుమూర్తి విగ్రహాలను ప్రభపై కొలువుంచి మేళతాళాల మధ్య వీధులలో ఊరేగించారు. ఉత్సవమూర్తులకు పారువేట చేపట్టారు. ఈ వేడుకను తిలకించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.