కోడుమూరు: మరుగుదొడ్లు లేని వారు దరఖాస్తు చేసుకోవాలి

75చూసినవారు
ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్లు ఉపయోగించాలని కోడుమూరు ఎంపీడీఓ రాముడు సూచించారు. మంగళవారం కోడుమూరు పట్టణంలో అధికారులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. మరుగుదొడ్ల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించి, ఎంపీడీఓ రాముడు మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో విసర్జన వలన గాలి కలుషితమై రోగాలు వ్యాపిస్తాయన్నారు. మరుగుదొడ్లు లేని వారు దరఖాస్తు చేసుకుంటే రూ. 12వేల నుంచి రూ. 15వేల వరకు మంజూరు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్