కర్నూలు డిఎస్ఏ ఔట్ డోర్ స్టేడియంలో మండలం ఎస్జిఎఫ్ టోర్నమెంట్ ను మండల కోఆర్డినేటర్ పుల్లన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్నూలు మండల విద్యాధికారి విజయ్, విశిష్ట అతిథిగా క్రీడా దాత జి.శ్రీధర్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది క్రీడల అభివృద్ధి అధికారి భూపతి రావు పాల్గొని క్రీడలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు ఓటమిని అంగీకరించి విజయానికి చేరువలో ఉండాలన్నారు. జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి పోటీలలో మంచి ప్రతిభ కనబరచలన్నారు.