పాణ్యం: టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి
టీడీపీ సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని టీడీపీ పాలక మండలి సభ్యుడు మల్లెల రాజశేఖర్ పార్టీ శ్రేణులను కోరారు. ఆదివారం ఓర్వకల్లు మండలంలోని హుస్సేనాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యకర్తకు భరోసా ఇస్తుందని, రూ. 100 సభ్యత్వంతో రూ. 5 లక్షల మేర బీమా సౌకర్యం ఉంటుందన్నారు. కార్యక్రమంలో నాయకులు బజారు, వేణు, రజాక్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.