కర్నూలు: లోకాయుక్త, హెచ్ఆర్సీ తరలిస్తే ఉద్యమం తప్పదు

76చూసినవారు
కర్నూలు: లోకాయుక్త, హెచ్ఆర్సీ తరలిస్తే ఉద్యమం తప్పదు
కర్నూలు నుండి అమరావతికి లోకాయుక్త, హెచ్ఆర్సీ తరలించరాదని కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. శనివారం వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి కర్నూలులో మాట్లాడారు. ఇప్పటికే కర్నూలు జిల్లా చాలా నష్టపోయిందని, కర్నూలుకు జగన్ తీసుకువచ్చిన సంస్థలను చంద్రబాబు తరలిస్తున్నారని విమర్శించారు. లోకాయుక్త, హెచ్ఆర్సీ తరలిస్తే ఉద్యమం తప్పదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్