పాణ్యం: హంద్రీనీవా ఉన్న త్రాగు, సాగు నీటికి ఇబ్బందులు
పాణ్యం నియోజకవర్గంలో హంద్రీనీవా పక్కనే ఉన్న త్రాగు, సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. మంగళవారం కర్నూలు నీటి పారుదల సమావేశంలో మాట్లాడారు. కేబినెట్ మీటింగ్ లో హంద్రీనీవా వెడల్పుకు ఆమోదం తెలపడం జరిగిందని, 40 టిఎంసిలకు అదనంగా మరో 23 టిఎంసిలు పెరిగే అవకాశం ఉందన్నారు. రైతుల పంట పొలాలకు అదనపు నీటి కేటాయింపు చేయాలన్నారు.