పాణ్యం: అధిక ధరలకు విక్రయిస్తున్న హోటళ్లపై చర్యలు తీసుకోవాలి

72చూసినవారు
కర్నూలు నగరం, కల్లూరులోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో వాటర్ బాటిళ్లు, కూల్ డ్రింక్లను ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బుధవారం లీటల్ మెట్రాలజీ డిప్యూటీ కమిషనర్ చల్లా దయాకర్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చి, మాట్లాడారు. కొన్ని హోటళ్లలో శుభ్రత పాటించడం లేదని, అధిక ధరలకు నాణ్యత లేని ఆహారం విక్రయిస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్