తుగ్గలి మండలంలోని మౌలాలి స్వామి ఉరుసు ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రాతిదూలం పోటీలు పోటాపోటీగా జరిగాయి. గురువారం తుగ్గలి మండలం ఉప్పర్లపల్లిలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బత్తిన వెంకట్రాముడు రాతిదూలం పోటీలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలా గ్రామీణ పోటీలు, రాతిదూలం పోటీలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు.