ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నట్లు వార్తలు రావడంతో పత్తికొండ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి శనివారం జనాలు క్యు కట్టారు. పత్తికొండ సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో దాదాపుగా జనంతో నిండిపోంది. ఆస్తుల విక్రయాలు, క్రయ విక్రయాల కోసం భారీగా ప్రజలు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు పోటెత్తారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద భారీగా కోలాహలం నెలకొంది. సాధారణ దినాలతో పోలిస్తే, ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగాయి.