విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్య అందించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆదేశించారు. బుధవారం తుగ్గలి మండలంలోని జొన్నగిరి ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. వంట, సరుకులను పరిశీలించి, రుచి చూసి, మాట్లాడారు. విద్యార్థులతో హాస్టల్లో కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. పదోలో ప్రతి విద్యార్థి 60 శాతం కంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా చూడాలన్నారు.