మతోన్మాద శక్తుల బారి నుండి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడండి

69చూసినవారు
పత్తికొండ పట్టణంలో సిపిఐ కార్యాలయ ఆవరణలో ఇండియా కూటమి అభ్యర్థుల సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో పత్తికొండ సిపిఐ అభ్యర్థి రామచంద్రయ్య, కర్నూలు జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి రాం పుల్లయ్య యాదవ్, సిపిఐ, సిపిఎం జిల్లా నాయకులు పాల్గొన్నారు. దేశంలో బిజెపి నియంతృత్వ ధోరణులు మితిమీరి పోతున్నాయని, మతోన్మాద శక్తుల నుండి కాపాడాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్