ఎమ్మిగనూరు: మద్యం దుకాణాల్లో చోరీ, రూ. 3. 50 లక్షలు అపహరణ

71చూసినవారు
ఎమ్మిగనూరు పట్టణంలోని మూడు మద్యం దుకాణాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారని పట్టణ సీఐ వి. శ్రీనివాసులు గురువారం తెలిపారు. మార్కెట్ వద్ద ఉన్న ఆదిలక్ష్మి వైన్ షాప్ రేకుల షెడ్ పైకప్పును కట్ చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు రూ. 2 లక్షలకు పైగా నగదు అపహరించుకెళ్లారు. హేమంత్ వైన్ షాపులో రూ. 1. 50 లక్షలు నగదు చోరీ చేసినట్లు యజమానులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సీసీకెమెరాల ఫుటేజ్ లను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్