ఆదోని పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో శనివారం అధికారులు స్వచ్ఛ ఆంధ్ర మిషన్ భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ విద్యార్థులకు తడి, పొడి, హానికారి చెత్త వేరు చేయడం గురించి తెలియజేశారు. అపరిశుభ్రత వల్ల కలిగే నష్టాలు, శుభ్రత వల్ల లాభాలను వివరించారు. అనంతరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో శానిటేషన్ పనులను పర్యవేక్షించారు.