ఆదోని: లబోదిబోమంటున్న లబ్ధిదారులు

75చూసినవారు
ఆదోని పట్టణంలోని సిరుగుప్ప చెక్ పోస్ట్ దగ్గర ఉన్న టిట్కో గృహాల వద్ద బుధవారం మున్సిపల్ అధికారులు మీటింగ్ ఏర్పాటు చేశారు. టిట్కో గృహాల తాళాలు తీసుకున్న లబ్ధిదారులు, ఇళ్లల్లో చేరాలని మున్సిపల్ అధికారులు ఆదేశించడంతో, లబ్ధిదారులు గృహాల వద్ద వచ్చి సరైన సౌకర్యాలు లేవని అధికారులపై మండిపడ్డారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే మేము గృహాలలో ఉంటామన్నారు. నీళ్లు, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేయండి అన్నారు.

సంబంధిత పోస్ట్