ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో గురువారం పత్తి క్రయవిక్రయాలు జరగవని యార్డ్ సెక్రెటరీ రామ్మోహన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పత్తి వ్యాపారుల అసోసియేషన్ సమావేశం ఉన్నందువలన వ్యాపారస్తులు పత్తి టెండర్లలో పాల్గొనడం లేదన్నారు. కావున పత్తి దిగుబడులను రైతులు గురువారం యార్డుకు తీసుకురావద్దని సూచించారు.