ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు సేవలు భావితరాలకు ఆదర్శమని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అన్నారు. ఆదివారం ఆదోనిలనని వారి కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమరణదీక్ష చేసి ప్రాణాలర్పించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్స్ వేణుసూర్య, శ్రీనివాసరాజు ఉన్నారు.