కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ఆదోని వ్యవసాయ మార్కెట్ పరిధిలో 56, 273 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసిందని మార్కెట్ యార్డ్ కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పత్తి గింజల ధరలు తక్కువగా ఉన్నందున మార్కెట్లో వ్యాపారులు పత్తిని కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొంటున్నారన్నారు.