ఆదోని మండలంలోని బసాపురం ఎల్లెల్సీ గట్టుపై రెండు బైకులు ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కౌతాళం మండలం కామవరంకు చెందిన అయ్యప్ప కొన్ని ఏళ్లుగా బసాపురంలో ఉంటూ, గొర్రెలను మేపుతున్నారు. శనివారం బైక్ పై ఎల్లెల్సీ గట్టుమీదుగా గొర్రెల వద్దకు వెళ్తుండగా, మరోవైపు బెలగాంకు చెందిన గొర్రెల కాపరి బైక్ అయ్యప్పను ఢీకొంది. అయ్యప్ప కాలు విరగడంతో ఆదోని ఏరియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం కర్నూలుకు తరలించారు.