ఆదోని పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభానికి ఆదోని టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, ఆదోని జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ మల్లప్ప, ఆదోని మున్సిపల్ ఛైర్పర్సన్ బోయ శాంత, ప్రత్యేక అతిథిలుగా హాజరై మాల్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాంతంలోని వ్యాపారవేత్తలు, స్థానిక నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.