ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు గ్రామంలో సోమవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు. గ్రామానికి చెందిన కృష్ణయ్య, రామచంద్రుడు అనే వ్యక్తులపై కడప జిల్లా పెద్దముడియం మండలం పెద్ద పసుపుల గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి మద్యం మత్తులో కత్తితో దాడికి పాల్పడినట్లు తెలిసింది. వెంకటేశ్వర్లు, అతని తండ్రి రామచంద్రుడు గాయపడినట్లు సమాచారం.