బ్రహ్మోత్సవాలలో భాగంగా జిల్లాలోని దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాదవరద స్వామి వారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కుటుంబ సమేతంగా శనివారందర్శించుకున్నారు. విజయానంద్ కు ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్, టీడీపీ యువనాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, బలిజ సత్రం అధ్యక్షుడు శెట్టి విజయ్ కుమార్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రభుత్వం తరపున ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు.