ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన టిడిపి కన్వీనర్లు క్లస్టర్లు యూనిట్ బూత్ ఇన్చార్జిలకు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2024- 2026 సంవత్సర కాలంలో టిడిపి సభ్యత నమోదు తదితర అంశాలపై నిర్వాహకులు శిక్షణ ఇచ్చారు. టిడిపి సభ్యత్వ నమోదు వలన కలిగే బీమా ప్రయోజనాల గురించి వివరించారు.