హత్యాయత్నం కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

1060చూసినవారు
హత్యాయత్నం కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
ఆళ్లగడ్డ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీ గార్డ్ నిఖిల్ పై జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరిని అరెస్టు చేయడం జరిగిందని ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ నందు శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆళ్లగడ్డ డీఎస్పీ షేక్ షర్ఫుద్దీన్ తెలిపారు. సీఐ రమేష్ బాబు, ఎస్సై నగీనా ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డిఎస్పీ మాట్లాడుతూ నిఖిల్ పై జరిగిన హత్యాయత్నం కేసులో రవి, నూలి అశోక్ అనే ఇద్దరినీ అరెస్టు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్