బాల్య వివాహాలు నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఐసిడిఎస్ నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం సూపర్వైజర్ సుశీలన్నారు. గురువారం చాగలమర్రిలోని బ్రిలియంట్ ఉన్నత పాఠశాలలో బాల్యవివాహాల నిరోధక చట్టం గురించి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ మాట్లాడుతూ బాల్య వివాహాల వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. చిన్న వయసులోనే తల్లులు కావడం దీంతో అనారోగ్యంతో మాత శిశు మరణాలు సంభవించడం జరుగుతుందన్నారు.