ఆళ్లగడ్డ పట్టణంలో వైసిపినేత భూమా కిషోర్ రెడ్డి బుధవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి హిందువుకు బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పే రోజు వస్తుందని వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తీసుకొని వచ్చి గతంలోని వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేయడం తగదన్నారు.