ఆలూరు: అదుపు తప్పి కారు బోల్తా.. ఎక్సైజ్ సీఐకి తీవ్ర గాయాలు

51చూసినవారు
ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడిన ప్రమాదంలో కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ అధికారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. బుధవారం మద్యం దుకాణాల తనిఖీల్లో పత్తికొండ నుంచి దేవనకొండకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ సుభాషిణి సిబ్బందితో కారులో వస్తుండగా గుంతను తప్పించబోయి కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎక్సైజ్ సీఐ సుభాషిని, హెడ్ కానిస్టేబుల్ వెంకటరాముడు, సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్