ఆలూరు: 2015లోనే చంద్రబాబు తవ్వకాలు అనుమతి జీవోలు ఇచ్చారు

55చూసినవారు
కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలపై అప్పటి సీఎం చంద్రబాబే అనుమతి ఇచ్చారని వైఎస్సార్సీపీ ఆలూరు ఎమ్మెల్యే బూసినె విరుపాక్షి స్పష్టం చేశారు. బుధవారం అమరావతిలో మాట్లాడారు. అప్పటి ప్రభుత్వం 2015లో జీవో జారీ చేసిందని చెప్పారు. యురేనియం తవ్వకాలను అడ్డుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ దాదాపు 150 మందిపై కేసులు పెట్టారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తవ్వకాలపై జారీ చేసిన జీవోను ఉపసంహరించాలన్నారు.

సంబంధిత పోస్ట్