వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించం

544చూసినవారు
టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని, ఇలాగే కొనసాగితే సహించే ప్రసక్తే లేదని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. సోమవారం బనగానపల్లెలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నామని అన్నారు. తమ సహనాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దని, టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడితే తిప్పికొట్టాల్సి వస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్