కోవెలకుంట్ల ఆలయాల్లో హనుమాన్ జయంతి సందడి

68చూసినవారు
కోవెలకుంట్ల ఆలయాల్లో హనుమాన్ జయంతి సందడి
కోవెలకుంట్ల పట్టణంలోని అభయాంజనేయ స్వామి, రామాలయం ఆలయాలతో పాటు మండలంలోని వివిధ గ్రామాల ఆలయాల్లో శనివారం హనుమాన్ జయంతి వేడుకల సందడి నెలకొంది. స్వామివారికి ప్రీతికరమైన పంచామృత అభిషేకం, గారెల నైవేద్యం, ఆకుపూజ, విశేష అలంకరణ చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవెలకుంట్ల మండలంలోని బిజినవేముల, ఆమడాల, రేవనూరు, కలుగొట్ల, కొప్పెర్ల, తదితర గ్రామాల్లోని ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్