బనగానపల్లెలో అధిక ఉష్ణోగ్రత నమోదు

66చూసినవారు
బనగానపల్లెలో అధిక ఉష్ణోగ్రత నమోదు
రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం బనగానపల్లె మండలంలో 42. 6 డిగ్రీలు, కోడుమూరులో 40. 8 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ కారణంగా మూడు రోజుల నుంచి ఎండలు, వడగాలుల తీవ్రత తగ్గినట్లు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్