రామతీర్థంలో అతిసారంతో యువతి మృతి

50చూసినవారు
రామతీర్థంలో అతిసారంతో యువతి మృతి
బనగానపల్లె మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ(30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గురువారం గ్రామస్థులు తెలిపారు. జీవరత్నం భార్య విజయమ్మ 2 రోజుల కిందట వాంతులు, విరేచనాలతో బనగానపల్లె ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. గ్రామంలో అతిసార ప్రబలడంతో 16 మంది అస్వస్థతకు గురయ్యారు. 3 రోజుల నుంచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్