చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే నివాళులు

85చూసినవారు
చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే నివాళులు
చేవెళ్ళ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా గురువారం ఆమె విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కాలే యాదయ్య మాట్లాడుతూ. వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తికి ప్రతీక. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆమె చూపిన తెగువ అందరికీ ఆదర్శమని తెలిపారు. నిత్య స్మరణీయురాలు ఐలమ్మ అని అన్నారు.

సంబంధిత పోస్ట్