కోడుమూరు: పాఠశాలల ప్రగతికి విద్యాశాఖ మంత్రి కృషి ప్రశంసనీయం

57చూసినవారు
కోడుమూరు: పాఠశాలల ప్రగతికి విద్యాశాఖ మంత్రి కృషి ప్రశంసనీయం
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రగతికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. శనివారం కర్నూలు మండలం మిలటరీ కాలనీ జడ్పీ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే దస్తగిరి హాజరై, మాట్లాడారు. పోటీలు నిర్వహించి, గెలుపొందిన విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. భవిష్యత్తులో స్థిర పడడానికి విద్య ఎంతో అవసరమన్నారు.

సంబంధిత పోస్ట్