రబీ కింద సాగు చేసిన వేరుశనగ, శనగ పంటలను రైతులు ప్రతి రోజు పరిశీలిస్తూ తెగుళ్లు సోకకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని కోడుమూరు ఏవో రవిప్రకాష్ సూచించారు. బుధవారం మండలంలోని ప్యాలకుర్తిలో ఏవో రైతులతో కలిసి వేరుశనగ, శనగ పంటపై పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించి, మాట్లాడారు. బోరుబావుల కింద సాగు చేసిన వేరుశనగ పంట పూత దశకు రాగానే ఎకరాకు 200కిలోల జిప్సంను చల్లాలన్నారు.