కోడుమూరు: ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు

78చూసినవారు
కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం కోడుమూరు నుంచి కర్నూలుకు ఏపీ21బీఎఫ్2212 నెంబర్ గల కారు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో కోడుమూరుకు చెందిన బండా శ్రీనివాసులు మృతి చెందగా, సోమశేఖర్, రాజోలి శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని 108లో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్