నాటుసారా స్వాధీనం, ఐదుగురు అరెస్టు

84చూసినవారు
నాటుసారా స్వాధీనం, ఐదుగురు అరెస్టు
అక్రమంగా నాటుసారా తయారీకి సంబంధించి ఐదుగురి నిందితులను సోమవారం అరెస్టు చేసినట్లు కోడుమూరు సెబ్ సీఐ రామాంజనేయులు తెలిపారు. కోడుమూరు సెబ్ పోలీసుస్టేషన్ పరిధిలో నాటుసారా తయారీ చేస్తున్న వెల్దుర్తి మండలం రత్నపల్లికి చెందిన ఈడిగ వెంకటేశ్, వెల్దుర్తికి చెందిన దూల రామచంద్రుడు, ఎల్. బండ తండాకు చెందిన ఘమికి బాయి, బద్దీ బాయిలను, కృష్ణగిరి మండలంలోని సంగాలకు చెందిన నంద్యాల మద్దయ్యలను అరెస్టు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్