నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

64చూసినవారు
నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం
కర్నూలు నగరంలోని డీ1 సెక్షన్ పరిధిలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, డీ2 సెక్షన్ పరిధిలో ఉదయం 9-11 గంటల మధ్యలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆయా సెక్షన్ల ఏడీఈలు సోమవారం తెలిపారు. సీతారామనగర్, ఎస్ఐసీ కాలనీ, ఇల్లూరి నగర్, అంబేడ్కర్ నగర్, ఎన్టీవో కాలనీ, కమలానగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంత రాయం ఉంటుందని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్