దొంగతనిలకు పాల్పడుతున్న ముద్దాయిని అరెస్టు చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఇన్ చార్జ్ డీఎస్పీ శ్రీనివాస ఆచార్ తెలిపారు. గురువారం మంత్రాలయం పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ.. సి బెలగల్ మండలం పోలకల్లుకు చెందిన ఉప్పర వీరేష్, దేవనకొండ మండలం, తెర్నెకల్లు రాజు అనేవ్యక్తులు జల్సాలకు, మద్యంకు బానిసులై రూ. 3 లక్షల 65 వేలు విలువ చేసే అయిదు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో దొంగతనం చేశారన్నారు.