విద్యారంగలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిసెంబర్ 9న విజయవాడలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోట్ల చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి ఈశ్వరెడ్డి కోరారు. గురువారం మంత్రాలయంలో గోడ పత్రికలను విడుదల చేశారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పోరాటమే ఏకైక మార్గమన్నారు. ఇందులో మండల ప్రధాన కార్యదర్శి శివశంకర్, వెంకటేశ్వర్లు, రామన్న, శ్రీనివాసులు, జగదీష్ ఉన్నారు.